బాధలు తొలగిపోతాయి
పనులు ప్రారంభించాలి
మల్హర్: చిన్ననీటి వనరులను రక్షించాలనే ఉద్దేశంతో 1975లో మండలంలోని ఉమ్మడి పెదతూండ్ల గ్రామ పంచాయతీ సమీపంలోని తీగలవాగుకు అడ్డంగా ఆనకట్టను రూ.13 లక్షలతో నిర్మించారు. కానీ 1978లో ఆనకట్టకు గండిపడడంతో ప్రాజెక్టులో నీరు నిలువలేదు. 1986లో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును పట్టించుకున్న పాపానపోలేదు. సుమారు 20 ఏళ్ల అనంతరం 2002లో రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలు పంపినప్పటికీ అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే జలయజ్ఞం కార్యక్రమం చేపట్టడంతో ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించింది. ఎన్నికల ప్ర చారంలో భాగంగా దివగంత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి స్థానిక నాయకులు ప్రస్తావన తీసుకొచ్చారు. తదనంతరం అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో 2006లో ప్రాజెక్టు అధునీకరణకు రూ.3.74కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు 456 జీఓను జారీ చేశారు. దీంతో టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనుల నిర్వహణలో తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో రెండు నెలల కాలంలోనే కురిసిన భారీ వర్షానికి మరోసారి ఆనకట్టకు భారీ గండి పడింది. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే గండి పడటంతో తమ తప్పును సమర్థించుకునేందుకు అధికారులు తప్పంతా కాంట్రాక్టర్‌పై నెట్టా రు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పని తీరు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆ శాఖ అధి కా రులపై ఉందనే విషయాన్ని మరిచిపోవడాన్ని రైతులు తీవ్రంగా విమర్శించారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టుకు తీగల వాగును అనుసంధానం చేస్తే మరమ్మతు పనులు జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈప్రాజెక్టు పూర్తయి తే దీనికింద 1029 ఎకరాల భూమి సాగులో వస్తుంది.
ముంపు బాధితులకు పరిహారం
ప్రాజెక్టుకు గండి పడటంతో ప్రాజెక్టు కింద భూములు నష్టపోయిన ముంపు రైతులకు పరిహారం అందించారు. ప్రాజెక్టు కింద సమూరు 71మంది రై తు ల వద్ద నుంచి అధికారులు 84 ఎకరాల పై చిలుకు భూములను సేకరించి, పరిహారం అందించారు.
ఏళ్ల నుంచి నిరుపయోగంగా ప్రాజెక్టు
వైఎస్సార్ ఆశయానికి తూట్లు
ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు వస్తే మాకు బాధలు తొలగిపోతాయి. సాగు చే స్తే వాన వస్తదో రాదో అని ప్రతి సంవత్సరం భయపడుతున్నాం. తీగల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాకు కావల్సినన్ని నీళ్లుంటాయి.
– మోహన్‌నాయక్, రైతు, అడ్వాలపల్లి
ఏళ్లుగా తీగులవాగు ప్రా జెక్టు నిరుపయోగం ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తియి అందుబాటులోకి వ స్తే నీళ్లు మంచిగా వస్తాయి. రెండు, మూడు పంట లైన పండిస్తాం. కష్టపడటానికి సిద్ధంగా ఉంటాం.
– కిషన్‌నాయక్, రైతు, అడ్వాలపల్లి, మల్హర్


