జేసీబీకి పుష్కరస్నానం | - | Sakshi
Sakshi News home page

జేసీబీకి పుష్కరస్నానం

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

మహాముత్తారం : సరస్వ తి అంత్యపుష్కరాలు సో మవారం ఐదో రోజు భ క్తులు పుష్కరస్నానం ఆచరించారు. కుటుంబ స భ్యులతో వచ్చిన ఓ బా లుడు తమవెంట తీసుకొచ్చిన ఆటవస్తువు (జేసీబీ)కి సైతం పుష్కరస్నానం చేయించాడు.

శివయ్యకు భక్తుల మొక్కులు

చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శివయ్య విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి చేరుకుని ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయం ముందు ఉన్న శివయ్య విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

కాళేశ్వర గాంధీ

మహాముత్తారం: కాళేశ్వ రం పుష్కరాల్లో సరస్వతి పుష్కరఘట్‌ వద్ద ఒకరు గాంధీ వేషధారణతో మెట్లపై భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తులు గాంధీతో సెల్ఫీలు దిగుతూ డ బ్బులు ఇవ్వడానికి పోటీపడ్డారు. భద్రాచలానికి చెందిన మధు జాతరలు, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో గాంధీ వేషధారణ వృత్తిగా మార్చుకొని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది చిల్లర లేవని వెళ్లిపోవడాన్ని గమనించి క్యూఆర్‌కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

చిలుక జోష్యం

మహాముత్తారం : సరస్వతి అంత్య పుష్కరా ల్లో భాగంగా పరిసర ప్రాంతాలతో పాటు పట్టణాల నుంచి వ చ్చిన వారు వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన చిలుక పంచాంగం జ్యోతిష్యుడు చిలుక పంచాంగం చెబుతామంటూ పుష్కర ఘాట్‌ వద్ద కూర్చొని జాతకం చూస్తామంటూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు.

కుర్రో.. కుర్రు

టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న అంత్య పుష్కరాల సందర్భంగా సరస్వతీ ఘాట్‌ వద్ద ఓ కోయ ప్రత్యేక వేషధారణలో కుర్రో, కుర్రు కొండ దేవర అంటూ భిక్షాటన చేశాడు. నడిరోడ్డుపై నిల్చుని ఎండలో భక్తులకు చేయి చాపడంతో భక్తులు సైతం అతనికి కానుకలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement