సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

సంక్షిప్త సమాచారం

ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలి

రేగొండ : కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధా న్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని ఎస్సై దాసరి సుధాకర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు నాణ్యత ప్రమాణా లను పాటించాలన్నారు. అలాగే కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకోడేపాకలోని మిల్లును సందర్శించారు. హమాలీల సంఖ్యను పెంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు.

దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి

చిట్యాల : ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్సై పోచంపల్లి సతీశ్‌ మిల్లు యాజమానులను కోరారు. సోమవారం మండలంలోని పలు రైస్‌ మిల్లులను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని లారీ, ట్రాక్టర్లలో తీసుకొస్తున్న తీరును చూసి రైస్‌ మిల్లుల యాజమానులతో మాట్లాడి దిగుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

ఎస్సీ కమ్యూనిటీ భవానాన్ని అప్పగించాలి

చిట్యాల: ఐదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసిన ఎస్సీ కమ్యూనిటీ భవానాన్ని మండల అంబేడ్కర్‌ యువజన సంఘానికి అప్పగించాలని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పుల్ల మల్లయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ శశివర్ధన్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ స్పందించి ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను అంబేడ్కర్‌ సంఘానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement