టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వస్తున్న భక్తులతో ఆటోలకు భలే గిరాకీ లభిస్తుంది. బస్టాండ్ నుంచి సరస్వతీ పుష్కరఘాట్ వరకు ఒక్కో వ్యక్తి నుంచి రూ.20–25 చార్జీలు తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకంతో ఆటోలకు గిరాకీ లేక ఇబ్బందులు ఎదుర్కొన్న డ్రైవర్లకు అంత్య పుష్కరాలు ఆసరగా నిలిచాయి. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు కొనసాగే పుష్కరాల్లో ఆటోడ్రైవర్లు ఆనందంగా ఉంటున్నారు.
అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్‌కు వస్తున్న భక్తులతో ఆటోలను నడుపుకుంటూ డ బ్బులు సంపాదించుకుంటున్నాం. ఇన్ని రోజులు గిరాకీలు లేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బస్టాండ్ నుంచి సరస్వతీ ఘా ట్‌కు ఆటోలు నడపుతూ బిజీ బి జీగా ఉన్నాం. – రాజు ఆటో డ్రైవర్, కాళేశ్వరం


