కాళేశ్వరం : పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తులు, ఈ వినోద కార్యక్రమాలు పిల్లలకు ఆనందాన్ని పంచడమే కాకుండా, పుష్కరాల సందడిని మరింత ఆహ్లాదకరంగా మా రుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చిన్నారుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు వినోదాన్ని కూడా అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు.


