కాళేశ్వరం: కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఆదివారం భక్తుల రద్దీ పెరగడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎస్పీ నిరంతరం భక్తుల రద్దీ పర్యవేక్షిస్తూ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తూ భక్తుల రాకపోకలను సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేయడంతో పాటు ఆలయంలో భక్తులు క్యూలైన్ విధానంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్‌లు, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన రహదా రుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు ని ర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులు పోలీస్‌శాఖ సూ చనలు పాటిస్తూ సహకరించాలని ఎస్పీ కోరారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


