భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని హనుమాన్ దేవాలయంతోపాటు భూపాలపల్లి మండలంలోని కొంపల్లి, ఫుల్లురామయ్యపల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాలలోని దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి సంబంధించి సోషల్ ఆడిట్‌లో భాగంగా దేవాదాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆదివారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాలు, రికార్డులను పరిశీలించారు. ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. పుజారులు ఆలయాల్లోని సమస్యలను అధికారి వరలక్ష్మికి వివరించారు. ఈ తనిఖీల్లో దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


