యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ ప్రశాంతం

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

కేయూ క్యాంపస్‌: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష–26 ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ట్రైసిటీలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్‌ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 4,075 మంది అభ్యర్థులగాను 2,762 మంది (67.78 శాతం) హాజరయ్యారు. 1,313 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండో సెషన్‌ను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. రెండో సెషన్‌లో 2,749 మంది అభ్యర్థులు(67.49 శాతం) హాజరుకాగా 1,326 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

పరీక్ష కేంద్రాల తనిఖీ..

హనుమకొండలోని ఎస్‌ఆర్‌ నేషనల్‌ హైస్కూల్‌, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ములుగు రోడ్డులోని గాయత్రి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, వరంగల్‌ ఎల్‌బీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూపీఎస్సీ సెంట్రల్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారి శుభం గౌడ్‌, రాష్ట్రస్థాయి అబ్జర్వర్‌ టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి, రూట్‌ అధికారులు, తహసీల్దారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

నిమిషం ఆలస్యంతో

పరీక్ష కోల్పోయిన ఆరుగురు

మొదటి సెషన్‌కు 67.78 శాతం..

రెండో సెషన్‌లో 67.49 శాతం

అభ్యర్థులు హాజరు

Advertisement
 
Advertisement
Advertisement