భూపాలపల్లి రూరల్: ఆదివాసీల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడి అమరుడైన గిరిజన వీరుడు కొమురం భీం ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సింగరేణి ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొర్ర రాంబాబు ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన కొమురం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం కొమురం భీం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
బాస్కెట్‌బాల్ పోటీల ఏర్పాట్ల పరిశీలన
పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో జూన్‌లో నిర్వహించనున్న బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.
జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరై కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, స్థానిక కౌన్సిలర్లు, సింగరేణి ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు, నాయకులు పాల్గొన్నారు
విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే
సత్యనారాయణరావు


