హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివా రం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వ యంభు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. హేమాచలక్షేత్రం ఆలయ పరిసరాలు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో పాటు సహజసిద్ధమైన జలపాతాలు ఉండటంతో మండు వేసవిలో భక్తులకు చల్లని ఆహ్లాదాన్ని పంచుతోంది. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు.

భక్తులకు స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరిస్తున్న పూజారి, ప్రత్యేక అలంకరణలో స్వామి

Advertisement
 
Advertisement
Advertisement