పచ్చి రొట్టతో భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

పచ్చి రొట్టతో భూసారం పెంపు

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

పచ్చి రొట్టతో భూసారం పెంపు టీఆర్‌ఎస్‌ గద్దెలు నిర్మించాలి చేపల విక్రయాలు పరామర్శ

మల్హర్‌: పచ్చి రొట్టతో భూసారం పెరుగుందని మండల వ్యవసాయ అధికారి శ్రీజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయితీపై 50 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మండలంలోని కొయ్యూరు ఆగ్రోస్‌ రైతు సేవ కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వరి, మిరప పంటలు వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తొలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకుంటే భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాఫిలతో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఒక బస్తా (30 కిలోల) జీలుగ విత్తనాలు రూ.2452.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అందుబాటులో జీలుగ విత్తనాలు

చిట్యాల: వానాకాలం సీజన్‌లో రైతుల కోసం 50శాతం రాయితీలో పచ్చిరొట్ట(జీలుగ) విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగ విత్తనాలు మండల కేంద్రంతో పాటు, మండలంలోని గిద్దెముత్తారం ఆగ్రోస్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

పారిశుద్ధ్య కార్మికుడిగా సర్పంచ్‌

మహాముత్తారం: గామాల్లో పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులతో తొలగిస్తారు. కాని సర్పంచ్‌ స్వయంగా మురికి కాల్వలోని చెత్తను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గండికామారం గ్రామ సర్పంచ్‌ సత్యం ఆదివారం గ్రామంలో చింతలపల్లె నుంచి గొల్లబుద్దారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన మురికి కాల్వ చెత్తా చెదారంతో నిండిపోయి మురికి నీరు రోడ్డుపై ప్రవహించేదాన్ని గమనించాడు. వెంటనే మురికి కాల్వలోని చెత్తా, ప్లాస్టీక్‌ కవర్లు ఆయనే తొలగించి పారిశుద్ధ్య కార్మికుడిగా మారాడు.

భూపాలపల్లి రూరల్‌: ప్రతీ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెలు నిర్మించాలని ఆ పార్టీ రాష్ట్ర అబ్జర్వర్‌ మెడల అభిలాష్‌ గౌడ్‌ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోటీఆర్‌ఎస్‌ పార్టీ గద్దెలు నిర్మాణం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వారు కోరారు. జిల్లా ఇన్‌చార్జ్‌ నరేష్‌ నేత, నియోజకవర్గ అబ్జర్వర్‌ అజయ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు వినోద్‌,నాయకులు గోవర్దన్‌, చుక్క రాజు, విగ్నేష్‌, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

మంగపేట: మండలంలోని చెరుపల్లి, బాలన్నగూడెం తదితర గ్రామాల్లో ఆదివాసీ గిరిజన మత్స్య సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో చేపలను పట్టి నాలుగు రోజుల నుంచి చెరువుల వద్దనే కేజి రూ.150కి విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో గోదావరి చేపలు కేజీ రూ.300 వందలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చేపలు రూ.200 వందలకు విక్రయిస్తున్నారు. కాగా, తాజా పట్టిన చేపలను కేజీ రూ.150కి విక్రయిస్తుంటడంతో స్థానిక ప్రజలు చెరువల వద్దకు వెళ్లి ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐదవ వార్డుకు చెందిన బాల్య నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15వేలు నగదును అందజేశారు. వార్డు సభ్యుడు కొండాయి చిన్ని, చంద్రబాబు, తాడూరి రఘు, మోహన్‌, శ్రీను, పృద్విరాజ్‌, హరిబాబు, శ్రీనివాస్‌, వెంకటస్వామి, మొగిళి పాల్గొన్నారు.

6వ వార్డులో..

మండలంలోని 6వ వార్డుకు చెందిన మాజీ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మాదరి రామయ్య తల్లి లక్ష్మీ ఇటీవల మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు నాయకులతో కలిసి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement