కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన నీలారపు రాజయ్య అనే రైతు భూమిలో 8 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పైపులైను వాటర్ లీకేజీ అవుతున్నాయి. దీంతో సాగుకు యోగ్యంగా లేక పొలం బీడుబారి బంజేరుగా మారింది. పైపులైన్‌కు మరమ్మతులు చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను ఎన్నిసార్లు కోరిన ఇప్పటికి కనికరించడం లేదని రైతు వాపోతున్నాడు. కాగా, పైపులైన్ లీకేజీ కారణంగా గ్రామ ప్రజలు కలుషిత నీరు తాగుతున్నారని రైతు ఆరోపిస్తున్నారు. అధికారులు దురుసుగా మాట్లాడి వెళ్లిపోతున్నారని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.


