మొగుళ్లపలి: రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మండలంలోని అకినపల్లి నుంచి అంతడుపుల గ్రామానికి జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్డు ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


