సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

May 24 2026 1:09 AM | Updated on May 24 2026 1:09 AM

సమస్యలు పరిష్కరించాలి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ‘బీఆర్‌ఎస్‌ హయాంలోనే రైతులకు ఇబ్బందులు’

మహాముత్తారం: తమ సమస్యలను పరిష్కరించాలని మండలకేంద్రంలోని మండల సమైక్య కార్యాలయం వద్ద శనివారం మండల వీఓఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో వీఓఏ జేఏసీ మండల అధ్యక్షుడు సకినాల మల్లేశ్‌, గౌరవ అధ్యక్షుడు జాడి వెంకటయ్య, ప్రధానకార్యదర్శి అంతటి రవి, ఉపాధ్యక్షుడు తొట్ల రాజేష్‌, వీఓఏలు పోరిక అకిల, ఐర్నేని సుభాషిణి, పారుపల్లి పోషయ్య, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: ప్రగతి ప్రశాంతి సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని పరిసరాలు, కాలనీల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బందికి శనివారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి కాలం నేపథ్యంలో కార్మికులు ఎండలో సైతం విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించి మజ్జిగ ప్యాకెట్లు అందించినట్లు సొసైటీ ఆర్గనైజర్‌ రావులు అనిల్‌కుమార్‌ తెలిపారు.

మల్హర్‌: ఐదేళ్లు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సీనియర్‌ ఉపాధ్యాయుడు కుమారస్వామి అన్నారు. శనివారం మండంలోని తాడిచర్ల జిల్లాపరిషత్‌ పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు కుమరస్వామి ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న మౌళిక వసతులు, పదిలో సాధించిన ఉత్తమ ఫలితాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేట్‌ పాఠశాలలో వేల రూపాయాల ఫీజులు నష్టపోవద్దని తల్లిదండ్రులకు సూచించారు.

ములుగు: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్‌ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు వరిపంట వేసుకోవద్దని తెలిపిందని పేర్కొన్నారు. దొడ్డు రకం పంటలను సాగుచేస్తే ధాన్యాన్ని కొనమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు యాసం రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

ములుగు: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు సాంబయ్య ఇటీవల వడదెబ్బతో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి శనివారం పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వడదెబ్బతో మృతిచెందిన సాంబయ్య కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు భిక్షపతి, రమేష్‌రెడ్డి, చంద్రమౌళి, వెంకన్న, సాగర్‌, ఓదేలు, కుమార్‌, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement