ఇసుక ట్రాక్టర్ల ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల ఇష్టారాజ్యం

May 24 2026 1:09 AM | Updated on May 24 2026 1:09 AM

టేకుమట్ల: మండలంలోని రాఘవరెడ్డి పేట శివారు చలి వాగు, కలికోట శివారు మానేరు నుంచి ఇసుకను జిల్లాలోని పలు మండలాలకు గృహ నిర్మాణ అవసరాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఎండలు తీవ్రతరం కావడంతో ఉదయం సాయంత్రం మాత్రమే ఇసుకను కూలీలు లోడింగ్‌ చేస్తున్నారు. దాంతో ఇసుక ట్రాక్టర్లు ఎక్కువ ట్రిప్పులను తరలించేందుకు ట్రాక్టర్‌ డ్రైవర్లు వాహనాల వేగాన్ని పెంచి అధిక వేగంతో ప్రయాణిస్తున్నారు. దీంతో రోడ్డుపై ఇతర వాహనదారులు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల మితిమీరిన వేగానికి ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే ఇసుక ట్రాక్టర్లు అధిక లోడ్‌తో వెళ్తున్నాయని తెలుపుతున్నారు. అధిక లోటుతో వెళ్లడం వల్ల రోడ్డుపై ఇసుక అక్కడక్కడ పోవడం ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని వాపోతున్నా రు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్ల అధికలోడుతోపాటు అధిక వేగాన్ని నియంత్రించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అధిక వేగంతో వెళ్తున్న డ్రైవర్లు

పట్టించుకోని అధికారులు

ఆందోళనలో ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement