పుష్కరాలు ప్రారంభమైనా పనులు పూర్తి కాలే.. | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలు ప్రారంభమైనా పనులు పూర్తి కాలే..

May 22 2026 4:22 AM | Updated on May 22 2026 4:22 AM

చిట్యాల: కాళేశ్వరంలో పన్నెండు రోజులపాటు జరిగే పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం అనేక పనులు చేపట్టారు. అయితే పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గురువారం పుష్కరాలు ప్రారంభమైనప్పటికీ ఎండ తీవ్రతతో భక్తులు తక్కువగానే వచ్చారు. దీంతో సౌకర్యాలకు ఇబ్బంది కలగలేదు. కానీ, జనం ఎక్కువ వచ్చిఉండే ఇప్పటికీ కొనసాగుతున్న పనులతో ఇబ్బందిపడేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గురువారం సైతం స్టాల్‌ వద్ద పనులు కొనసాగుతున్నాయి. అలాగే మండుటెండలో సిబ్బంది విద్యుత్‌ పనులు చేశారు. స్టాల్‌వద్ద

పుష్కరాలకు షటిల్‌ సర్వీసులు

భూపాలపల్లి అర్బన్‌: మహాదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు అధికారులు షటిల్‌ సర్వీసులు ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్‌ నుంచి సరస్వతీ పుష్కర ఘాట్‌ వరకు భక్తులను తరలిస్తున్నారు. జిల్లాలో వివిధ మండలాల ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన బస్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. మొదటి రోజు భక్తులు అంతంత మాత్రమే రావడంతో కొద్దిమంది భక్తులను సైతం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement