అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలి

కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయఽశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో మే 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్‌బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్‌ పోస్టర్‌, పుష్కరాల టీజర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, గోవిందహరి, కృష్ణవేణి, రామకృష్ణారావు, ఈఓ మహేష్‌, దేవస్థానం చైర్మన్‌ అవధాని మోహన్‌శర్మ, అర్చకులు పణీంద్రశర్మ, శరత్‌చంద్ర, ధర్మకర్తలు శ్యామ్‌, పద్మ, అశోక్‌, సత్త య్య, శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు

పుష్కరాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement
 
Advertisement
Advertisement