ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

గోవిందరావుపేట: మండల పరిధిలోని ధాన్యం కొనుగోళ్లలో పలువురు రైస్‌ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తాలు పేరుతో కటింగ్‌ చేస్తున్నారని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో 163 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. మిల్లర్ల కటింగ్‌లతో ఒక్కో లారీకి రూ.30వేల నుంచి రూ.40వేల వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలకు మించి కటింగ్‌ చేయడం అన్యాయమన్నారు. కటింగ్‌లను వెంటనే నిలిపివేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు ధాన్యం అమ్మకాల సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడితే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిబాబు, రామస్వామి, నరసింహ నాయక్‌, సాంబశివుడు, సుధాకర్‌ రెడ్డి, చందూలాల్‌, సదానందం, సాంబయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.

తాలు పేరుతో కటింగ్‌లకు

పాల్పడుతున్న రైస్‌ మిల్లర్లు

నిరసిస్తూ ఎన్‌హెచ్‌పై

అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో

Advertisement
 
Advertisement
Advertisement