ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జాగ్రత్తలు | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జాగ్రత్తలు

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జాగ్రత్తలు

భూపాలపల్లి అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై బూత్‌ స్థాయి అఽధికారులు జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ప్రసునాంబ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి మండలంలోని బూత్‌ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓ) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై కీలక సూచనలు జారీ చేశారు. 2025–2002 ఓటరు జాబితాలో షిఫ్టింగ్‌, డబుల్‌, డెత్‌ కేసులను గుర్తించి సంబంధిత జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఓటర్ల విషయంలో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఫారం–7 దరఖాస్తులు సమర్పింపజేయాలని సూచించారు. బీఎల్‌ఓ యాప్‌లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాలను సమగ్రంగా మ్యాపింగ్‌ చేసి, నమోదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి, ఓటరు జాబితా శుద్ధిని ఖచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్‌ లక్ష్మిరాజయ్య, డీటీ అంజలిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల సంఘం పరిశీలకులు

Advertisement
 
Advertisement
Advertisement