భూపాలపల్లి రూరల్: వాసవి మాత జయంతి వేడుకలను ఐడీఓసీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని వాసవి మాతకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావు మా ట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా జరుపుకునే వాసవీ మా త జన్మదినం ఎంతో పవిత్రమైనదన్నారు. పార్వతీ దేవి అవతారమైన వాసవి మాత అహింసా మార్గాన్ని అనుసరించి సమాజానికి శాంతి, సామరస్యాని కి ప్రతీకగా నిలిచిన గొప్ప దైవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, కౌన్సిలర్లు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్‌ఐ అడ్మిన్ రత్నం వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


