చిట్యాల: మలేరియా నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సీహెచ్.మధుసూదన్, మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్ అన్నారు. శనివారం మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన సమయంలో పరీక్షలు చేయించుకుంటే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల చుట్టూ మురికి నిల్వలు ఉండకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని కోరారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించడం ద్వారా దోమల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఒడితల వైద్యాధికారి మౌనిక, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సుధాకర్, జిల్లా అకడమిక్ రమేశ్, సబ్ యూనిట్ అధికారులు హలీం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్


