శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు

మొగుళ్లపల్లి: వేసవి క్రీడ శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. శుక్రవారం మండలంలోని వేములపల్లి గ్రామంలో బాల్‌బ్యాడ్మింటన్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ శిబిరాలు ఏప్రిల్‌ 24నుంచి జూన్‌ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అరెల్లి రమేష్‌, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement