● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి: రైతులు ఇబ్బందులు పడకుండా ధా న్యం కొనుగోలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ, సహకార, డీఆర్‌డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, రవా ణా, రైస్ మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు, వివిధ శా ఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రవాణాకు లారీలు అందుబాటులో ఉంచాలని, తూ కం అవగానే ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సివిల్ సప్లయీస్ అధికారులు రాములు, కిరణ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇంటెన్సివ్ రివిజన్ వేగిరం చేయాలి..
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనగణన స్వీయ నమోదు, వరి కోతలపై హార్వెస్టర్లకు అవగాహన కార్యక్రమం, తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి ఐదు రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఇందుకు తక్షణం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 69.66 శాతం ఓటర్లు మ్యాపింగ్ జరిగిందని, రెండు నెలలుగా పురోగతి రాలేదన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, వివి ధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


