ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

భూపాలపల్లి అర్బన్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య తెలిపారు. స్థానిక తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్లను గుర్తించి అధికారిక చర్చలు జరపాలని సూచించారు. లేబర్‌ కోడ్‌లను ఆధారంగా చేసుకుని ఆర్టీసీ సమ్మెను అణచివేయాలని ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు దాసరి జనార్దన్‌, కాసర్ల ప్రసాద్‌ రెడ్డి, నామాల శ్రీనివాస్‌, రాళ్లబండి బాపు, జయశంకర్‌, రవి, సా జిత్‌, నరసింహారెడ్డి, సలీం, మధుకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement