నిర్మాణాలు ఇవే..
కాళేశ్వరాలయంలో నిర్మాణాలను కూల్చుడేనా..?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాంతాన్ని కాకతీయులు, చాళుక్యులు పాలించిన చారిత్రక ఆధారాలున్నాయి. ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (యముడు, శివుడు) కొలువైన ప్రత్యేకత కాళేశ్వరం చరిత్ర. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన అప్పటి సీఎం కేసీఆర్ రూ.25కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి ప్రారంభించారు. ఆ నిధులతో పలు నిర్మాణాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతేడాది సరస్వతినది పుష్కరాలకు రూ.35కోట్లతో శాశ్వత నిర్మాణాలు, కొన్ని తాత్కాలిక పనులు చేశారు. దీంతో అ భివృద్ధి వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 20న సోమవారం రూ.198కోట్ల వ్యయంతో కా ళేశ్వరం పునరుద్ధరణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారు. దీంతో ఆలయం రూపురేఖలు మారనున్నాయని చర్చ జరుగుతుండగా.. నిర్మాణా లు కూల్చివేతలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
శృంగేరి పీఠాధిపతులు అనుమతి..
1982లో జీర్ణోద్ధరణ సమయంలో శృంగేరీ పీఠాధిపతితో కుంబాభిషేకం చేశారు. అనంతరం గతేడాది ఫిబ్రవరిలో కూడా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయాల తొలిగింపు ప్రక్రియకు శృంగేరి పీఠాధిప తి అనుమతి తీసుకుంటామని, నిర్మాణాలు మొదలైతే అడవిలో వెలిసిన ఆదిముక్తీశ్వరాలయంలో ద ర్శనాలు జరుగుతామని సోమవారం భూమి పూజ సమయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే నిర్మాణాలు చేపట్టారు. దీంతో మాస్టర్ ప్లాన్‌లో నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.198 కోట్ల వ్యయంతో కాళేశ్వరం దేవస్థానం ప్రధాన గర్భగుడి, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు రాతితో నిర్మించనున్నారు. రెండు ఆలయాలు 1978–82 మధ్యన జీర్ణోద్దరణ సమయంలో సిమెంట్, డంగు సున్నంతో నిర్మించిన కట్టడాలు. వీటిలో నాలుగైదేళ్ల కిందట నిర్మించిన ప్రధాన ఆలయం మండపానికి ఆనుకొని నిర్మించిన అనివెట్టి మండపం, ప్రధాన ఆలయానికి ఎడమ వైపున అభిషేక మండపం, ఉత్తరం వైపున నిర్మించిన శివ కల్యాణ మండపం ఇటీవల శివరాత్రికి ప్రారంభించారు. వెలుపలి ప్రకార ఆలయాలు, విగ్రహాలు, ఈఓ కార్యాలయంతో పలు నిర్మాణాలు తొలిగించనున్నారని సమాచారం. ఇంకా ప్రకారాలు, గోపురాలు తొలిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాటి స్థానంలో నూతనంగా నిర్మాణాలు జరగనున్నాయి.
కాళేశ్వరం మాస్టర్‌ప్లాన్‌తో
చర్చనీయాంశం
ఇటీవల దేవస్థానం పునరుద్ధరణ
పనులకు సీఎం శంకుస్థాపన


