వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తా.. | - | Sakshi
Sakshi News home page

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తా..

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

భూపాలపల్లి: ఈరోజు తేదీ, సమయం రాసి పెట్టుకో.. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, జరగకపోయినా, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తానని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకనే బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు, ఆరోపణలకు పాల్పడుతున్నారన్నారు. ఇంజనీర్లు చెప్పినా.. వినకుండా నాటి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఒక్క ఎకరానికై నా సాగునీరు అందుతుందా? అని ప్రశ్నించారు. సర్పంచ్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే సమ్మె విరమణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు కురిమిళ్ళ శ్రీనివాస్‌, రాజునాయక్‌, అరుణ్‌, బౌతు రాజేష్‌, నాయకులు ఇస్లావత్‌ దేవన్‌, చల్లూరి మధు, బీర్తి పృధ్వి, జంపన్న, పైడిపెల్లి రమేష్‌, దాట్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
 
Advertisement
Advertisement