పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

భూపాలపల్లి అర్బన్‌: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని ఏరియా ఇంజనీర్‌ మాల ఎర్రన్న అన్నారు. బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలోని జీఎం కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమంతో పాటు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏరియా ఇంజనీర్‌ మాల ఎర్రన్న మాట్లాడుతూ ప్రకృతి సంపదలను కాపాడడం ద్వారా భవిష్యత్‌ తరాలకు మంచి జీవన వాతావరణం అందించవచ్చన్నారు. సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పలు హరిత కార్యక్రమాలు చేపడుతోందని, ఉద్యోగులు, ప్రజలు కలిసి చెట్ల నాటకం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, నీటి సంరక్షణ వంటి చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం 20 సంవత్సరాలుగా జేవీఎస్‌ చంద్రశేఖర్‌ (గ్రీన్‌ వారియర్‌, రిటైర్డ్‌ సింగరేణియన్‌) పర్యావరణంపై విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉద్యోగులు, విద్యార్థులకు విలువైన జ్ఞానం అందిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం చంద్రశేఖర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ) జోతి, ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ పోషమల్లు, పర్సనల్‌ మేనేజర్‌ కావూరి మారుతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement