● వైల్డ్‌లైఫ్ ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి నరేందర్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తాడ్వాయి వైల్డ్‌లైఫ్ ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి నరేందర్ అన్నారు. వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకుని వైల్డ్‌లైఫ్ అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విరివిగా మొక్కలు నాటడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఉన్న అడవులను సంరక్షించుకోవాలన్నారు. అడవులు సురక్షితంగా ఉంటనే వాతావరణ సమతూల్యత ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ లింగయ్య, బీట్ ఆఫీసర్లు సుభాశ్, బాలకృష్ణ పాల్గొన్నారు.


