న్యూస్‌రీల్
జిల్లాలో ఇటీవల
జరిగిన సంఘటనలు..
● ఈ నెల 17న చిట్యాల మండల కేంద్రానికి చెందిన గుర్రపు పోచమ్మ తన కూతురు ఇంటికి వెళ్తున్న క్రమంలో కుక్క వెనుక నుంచి వచ్చి కరిచింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
● ఈ నెల 9వ తేదీన రేగొండ మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన సరోజన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె కాలిపై కుక్క కరిచింది.
● గత నెల 29న గణపురం మండలకేంద్రానికి చెందిన దామ చేరాలు అనే వ్యక్తి ఇంటి ఎదుట నిలబడి ఉండగా ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి కాలి భాగంలో కరవడంతో తీవ్ర రక్తస్రావం అయింది.
● తాజాగా నిన్న (బుధవారం) మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కృష్ణ ఇంటి నుంచి బయటకు రాగా కుక్క కరవడంతో అతడిని పీహెచ్‌సీలో చేర్పించి చికిత్స చేయించారు.


