భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్‌ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం నిర్వహించే వేసవి శిబిరాలను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఏప్రిల్ 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయన్నారు. ఆసక్తి గల కోచ్‌లు తమ పూర్తి వివరాలతో దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోపు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందించాలన్నారు. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు కోచ్‌లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న ప్రతీ కోచ్‌కు రూ.5వేల గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 9618011096, 8125113132 సెల్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
పది రోజుల పాటు
మేడే కార్యక్రమాలు
భూపాలపల్లి అర్బన్: మే 1 నుంచి 10వ తేదీ వరకు జిల్లాస్థాయిలో మే డే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారిణి వినోద బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయిలో కార్మిక సంఘాలు, ఉద్యోగి కల్పన మండలి శాఖలు, ఫ్యాక్టరీలు, ఏటీసీ ప్రిన్సిపల్ తదితర సంస్థల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలని, అన్ని కార్మిక శాఖలు, ఉద్యోగి కల్పన శాఖలు, ఫ్యాక్టరీలు, ఏటీసీ ప్రిన్సిపాల్స్ సంబంధిత అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమాల నివేదికలు ఈ నెల 27 తేదీ లోపు కార్యాలయంలో అందించాలని సూచించారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న విద్యుత్ సౌద ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో యూనియన్ నాయకులు వాల్‌పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్టీపీ ద్వారా సరఫరా అయిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51వేల కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌద ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపురావు, తోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలపై
ఆకస్మిక తనిఖీ
చిట్యాల: మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య శ్రీ సేవలపై ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ పి. విక్రమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ విభాగంలో పని చేస్తున్న ఆరోగ్య మిత్రల రికార్డులను పరిశీలించారు. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా టీం లీడర్ యామంకి అనిల్, ఆరోగ్య మిత్రలు గుర్రపు రాజమొగిలి, స్వప్నదేవి తదితరులు ఉన్నారు.
రామప్పలో
శిక్షణ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ ఏఎస్‌వోలు సందర్శించారు. భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించగా శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.


