కదలని బస్సులు | - | Sakshi
Sakshi News home page

కదలని బస్సులు

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

– మరిన్ని ఫొటోలు, వివరాలు 8లోu

భూపాలపల్లి: తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్‌ బుధవారం సక్సెస్‌ అయింది. కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపధ్యంలో మంగళవారం రాత్రి భూపాలపల్లి కార్మికులు డిపో వద్దకు చేరుకున్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కాగా డిపోలోని కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడంతో బస్సుల రాకపోకలు సాగలేదు. బుధవారం ఉదయం డిపో అధికారులు ప్రైవేట్‌ బస్సుల యజమానులను పిలిపించి బస్సులను నడిపించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అద్దె బస్సుల రాకపోకలు సైతం నిలిచిపోయాయి. వివిధ కారణాలతో పట్టణంలో నిలిచిన ఉన్న ఆరు అద్దె బస్సుల డ్రైవర్లతో అధికారులు ఫోన్లో మాట్లాడి పలు రూట్లలో నడిపించారు. టికెట్‌ లేకుండా ఉచితంగా బస్సులను నడిపించినప్పటికీ సమ్మె ప్రభావం కారణంగా ప్రయాణికులు అంతగా రాకపోకలు సాగించలేదు. భూపాలపల్లి బస్‌డిపోలో ఆర్టీసీ, అద్దె బస్సులు మొత్తం 81 ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీరోజు డిపోకు రూ.21 లక్షల ఆదాయం రానుండగా బుధవారం ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్‌, సీపీఐ, వివిధ పార్టీలు మద్దతు పలికాయి. సమ్మె సందర్భంగా డిపో ఎ దుట ధర్నా చేసిన వారిలో కార్మిక సంఘాల నాయకులు బుర్రి తిరుపతి, సందీప్‌, కొమురన్న, ప్రసాద్‌, రాధాకృష్ణ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సమ్మెకు టీపీఎస్‌ మద్దతు

మల్హర్‌(కాటారం): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (టీపీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా చైతన్యంతో సమ్మెను కొనసాగించాలనిపిలుపునిచ్చారు.

భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ బంద్‌ సక్సెస్‌

ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించిన

ప్రయాణికులు

అద్దె బస్సులను నడిపించేందుకు అధికారుల యత్నం

అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

Advertisement
 
Advertisement
Advertisement