పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలి

మొగుళ్లపల్లి: వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మరమ్మతు చేయాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు అందించా లన్నారు. 31 పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు పనులను పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాల్లో వందశాతం మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ స రఫరా ఉండాలని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా పునరుద్ధరణ పనులను మే 10వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్‌ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ‘వెల్ఫేర్‌ వీక్‌‘ సందర్భంగా అన్ని రకాల సంక్షేమ హాస్టల్లో ప్రణాళిక ప్ర కారం నిర్వహించాలన్నారు. 23న పీటీఎం, 24న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, 25న విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహించి క్రీడలు, కళలు, హస్తకళలు, సంగీతం, డిజిటల్‌ లెర్నింగ్‌, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్‌, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఇంజనీరింగ్‌ అధికారులు, తహసీల్దార్‌ సునీత, ఎంపీడీఓ సురేందర్‌, ఎంపీఓ సుభాష్‌చంద్రబోస్‌, ప్రిన్సిపాల్‌ శ్యామల, సర్పంచ్‌ విజయ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement