24న జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

24న జాబ్‌ మేళా

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అఽధికారి శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయం ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థ పోర్టీ మెడికల్‌ కంపెనీ ద్వారా కేర్‌ టేకర్స్‌ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు నెలకు రూ.16,500 నుంచి రూ.22,000 వరకు జీతం, ఉచిత ఆహారం, వసతి, రవాణా సౌకర్యాలు, అదనంగా రూ.50,000 ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 8వ తరగతి నుంచి ఏదైనా విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 50 పోస్టులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల యువత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, బయోడేటాతో ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 97010 78288 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ నెల 25వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హసన్‌పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని గురుకుల కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు

భూపాలపల్లి రూరల్‌: కాటారం మండలం నస్తూర్‌పల్లిలో సీఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌ కృతజ్ఞతలు తెలి పారు. మంళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, ఏర్పాట్లు చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భువనసుందర్‌, కోకిల లక్ష్మి, పరమేశ్వరి, అప్పాల శీను, ఎన్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు మట్టెవాడ సురేష్‌, వినోద్‌, విజయభాస్కర్‌, నాగరాజు, సురేష్‌, కార్తీక్‌, రాజు, పాల్గొన్నారు.

ఆర్టీసీ సమ్మెకు

టీఆర్‌పీ మద్దతు

భూపాలపల్లి రూరల్‌: ఆర్టీసీ సమ్మెకు టీఆర్‌పీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్‌ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకు భూపాలపల్లిలో ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్‌ రాజ్‌, నాయకులు మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్‌, స్వామి పాల్గొన్నారు.

ఐటీడీఏ ఏపీఓగా

నాగోవరావు

ఏటూరునాగారం: ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఏపీఓగా బాధ్యతలను చేపట్టారు. హైదరాబాద్‌ ప్లేన్‌ ఏరియా ఐటీడీఏ పరిధిలో పనిచేసిన నాగోవరావును ఏటూరునాగారం ఐటీడీఏకు, ఇక్కడ పనిచేసిన వసంతరావును ఉట్నూరు ఐటీడీఏకు బదిలీ చేశారు. దీంతో నాగోవరావు మంగళవారం విధుల్లో చేరారు. దీంతో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని వివరాలను వెల్లడించారు.

కొత్త కోర్సులు

ములుగు రూరల్‌: సమ్మక్క,–సారలమ్మ గిరిజన యూనివర్సిటీలో మూడు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బీఏ ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌ కోర్సులు అమలు అవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్లు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌, డేటా అనలిస్టు, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌, కంప్యూటరింగ్‌ కోర్సులను అందించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement