వైకుంఠధామానికి దారేది? | - | Sakshi
Sakshi News home page

వైకుంఠధామానికి దారేది?

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

వైకుంఠధామానికి దారేది? రోడ్డు సౌకర్యం కల్పించాలి..

అరిగోస పడుతున్న ఆత్మీయులు

పట్టించుకోని అధికారులు, పాలకులు

చిట్యాల: చివరి మజిలీలో ఎవరూ ఇబ్బందులు పడవద్దనే ఆలోచనతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించారు. కానీ సరైన దారులు లేక మృతుల బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.

ఏలేటిరామయ్యపల్లిలో..

మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామ శివారు చలివాగు పక్కన గత ప్రభుత్వ హయాంలో వైకుంఠధామాన్ని నిర్మించారు. కానీ దారి సక్రమంగా లేకపోవడంతో మృతిచెందిన వారిని కనీసం తీసుకపోవడానికి సైతం అనేక అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. వైకుంఠధామానికి సరైన దారి నిర్మాణం చేయాలనే ఆలోచన పాలకులకు, అధికారులకు ఎందుకు రావడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు నిర్మాణం చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు పాలకులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

గ్రామంలో వైకుంఠధామానికి సరైన రోడ్డు లేదు. గ్రా మంలో ఎవరైనా మృతిచెందితే తీసుకెళ్లడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వ స్తుంది. అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలి.

– మర్రి నరేష్‌, ఏలేటిరామయ్యపల్లి

Advertisement
 
Advertisement
Advertisement