న్యూస్‌రీల్
భూపాలపల్లి జిల్లా వేదికగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రేవంత్ శ్రీకారం
నిరుపయోగంగా చిట్యాల బస్టాండ్
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనం
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు 385 మంది విద్యార్థులకు 332 మంది హాజరుకాగా, ఇంటర్ పరీక్షలకు 611 మంది విద్యార్థులకు గాను 541 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ రాజేందర్, ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేశ్ తనిఖీ చేశారు.
28న విద్యుత్ సౌధ ముట్టడి
భూపాలపల్లి అర్బన్: సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యుత్ సౌధ ముట్టడికి సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థల నుంచి ఏళ్ల తరబడి బకాయిలు రావడం లేదన్నారు. ఇప్పటికి రూ.51వేల కోట్లు పేరుకుపోయినట్లు తెలిపారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సింగరేణి అధికారులు విద్యుత్ సంస్థలకు బొగ్గు రవాణా నిలివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన సింగరేణి రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆరోపించారు.
మహాత్మ బసవేశ్వర మార్గం స్ఫూర్తిదాయకం
భూపాలపల్లి రూరల్: సమానత్వం, సామాజిక న్యాయంపై మహాత్మ బసవేశ్వర చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహాత్మ బసవేశ్వర 892వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారా యణరావు ముఖ్యఅతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యతో కలిసి మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిర, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి క్రాంతి కిరణ్, బీసీ సంఘాల ప్రతినిధులు కంపాటి రాజయ్య, మాటూరి శ్రీనివాస్, యుగేందర్, మాటూరి మంజుల, శివ దర్శనం, సతీష్ పాల్గొన్నారు.
ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి
వెంకటాపురం(ఎం): ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో నిర్మిస్తున్న రామాలయానికి సోమవారం మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్మించిన పెద్దమ్మగుడిని సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బొమ్మకంటి వంశావతిరమేశ్, మామిడిశెట్టి సుగుణస్వామి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు భగవాన్‌రెడ్డి, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీలపై దాడులు ఆపాలని వినతి
ములుగు రూరల్: జిల్లాలోని వలస ఆదివాసీల గూడేలపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సీపీఎం నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గూడేలపై ప్రజలు సాగు చేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తక్షణమే అటవీశాఖ అధికారులు దాడులు ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, రత్నం రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్‌జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్‌కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు.
సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష..
మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు.
ప్రతిపక్షాలపై నిప్పులు..
అభివృద్ధి, సంక్షేమానికి హామీ..
కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్‌ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగా
కుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్‌సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
నస్తూర్‌పల్లి
బహిరంగ సభలో
అభివాదం
చేస్తున్న
సీఎం
రేవంత్
‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
నిరుపయోగంగా ఉన్న బస్టాండ్
చిట్యాల: చిట్యాల బస్టాండ్ నిర్మాణం పూర్తయి రెండున్నరేళ్లవుతున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి కట్టినా ప్రయాణికులకు ఉపయోగం లేకుండా మారింది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రారంభిస్తే ప్రయాణికులకు ఉపయోగం కలగనుంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చిట్యాల బస్టాండ్‌ను రూ.25లక్షలతో నిర్మాణం చేపట్టారు. రెండున్నరేళ్ల క్రితం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటి వరకు ప్రారంభించడం లేదు. బస్టాండ్ చుట్టూ సీసీ రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మండల నాయకులు కోరగా స్పందించి సీసీ రోడ్డు వేయించారు. కానీ ప్రారంభం విషయంలో మాత్రం చొరవచూపడం లేదు. బస్టాండ్‌ను ప్రారంభిస్తే ప్రయాణికులకు మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. బస్టాండ్ ప్రారంభం కాకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు మందుబాబులు కూర్చుని మద్యం సేవిస్తున్నారు. వాహనాలు సైతం నిలుపుతున్నారు.
చిట్యాల బస్టాండ్‌ను వెంటనే ప్రారంభించేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలి. మండలకేంద్రానికి వచ్చే బస్సులు బస్టాండ్ వద్ద నుంచి వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– అల్లం రవీందర్,
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, చిట్యాల
గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నా భర్తకు వేతనం రావడం లేదు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కాంటిజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న నా భర్త ప్రసాద్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను విధులకు హాజరవుతున్నాను. 2020 నుంచి వేతనం రావడం లేదు. అధికారులు, పీఓలు మారుతున్నా వేతనం రాక ఇబ్బందులు పడుతున్నాం. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పెండింగ్ వేతనాలు వచ్చేలా చూడాలి.
– ఆలం రామలక్ష్మి, మేడారం, తాడ్వాయి
వెంకటాపురం(కె) మండలంలోని అలుబాక పంచాయతీ పరిధి ముత్తారం గ్రామస్తులతో కలిసి ఇసుక క్వారీ సొసైటీని ఏర్పాటు చేశారని కుర్సం ముత్తయ్య, బాడిష కన్నయ్య, మడ సుజాత, బాడిష స్వప్నలు కలెక్టర్‌కు విన్నవించారు. ముత్తారంలో సొసైటీ ఏర్పాటు చేసి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు జమ ఖర్చు చెప్పడం లేదు. పెసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్‌ను సొసైటీ విషయం ఏది అడిగిన ఇవ్వడం లేదు. సొసైటీ పేరు కూడా చెప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మూడు మార్లు రూ.4 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుక బయటకు రవాణా చేసినప్పటికీ వాటి కమీషన్ తమకు ఇవ్వకుండా అధికారులు, సొసైటీ సభ్యులు మింగి కూర్చుంటున్నారని తెలిపారు. గ్రామంలోని గిరిజన కుటుంబాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా సొసైటీ సభ్యులు సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా పాత సొసైటీని రద్దు చేసి కొత్త సొసైటీని ఏర్పాటు చేయాలని ముత్తారం గ్రామస్తులు కోరారు.
ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు
ఎన్‌డీఎస్‌ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం
బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన
పట్టించుకోని అధికారులు.. పాలకులు
రూ.లక్షలు వెచ్చించినా నిరుపయోగం


