భూపాలపల్లి రూరల్: కాటారం మండలం నస్తురుపల్లిలో నేడు(సోమవారం) నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, కార్మికులు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఆదివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, లోపాలను ప్రజలకు తెలియజేయడం, బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. బహిరంగసభకు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, దేవన్, దాట్ల శ్రీనివాస్, ఆకుల మహేందర్, రంజిత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


