చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామ శివారు మీదుగా వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను బాధిత రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమకు పూర్తిస్థాయిలో భూ పరిహారం చెల్లించలేదని, భూ పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వసంతరావు, చిట్యాల, మొగుళ్లపల్లి ఎస్సైలు పోచంపల్లి సతీష్, ముప్పు సురేష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు దువ్వల సత్యనారాయణ, దువ్వల లక్ష్మీ, బిల్ల సత్యనారాయణరెడ్డి, నర్సయ్య, కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
21న ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఈనెల 21న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్.శ్యాంసుందర్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కృష్ణకాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం జరుగుతుందన్నారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ విశ్వనాథ మహర్షి నేతృత్వంలో నిర్వహించే ఈ శిబిరంలో చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండె దడ, బీపీ, షుగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఉచిత వైద్యసేవలు అందించనున్నారు. పూర్తి వివరాలకు 9849574706 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
‘దేవాలయ నిర్మాణంపై ఆరోపణలు సరికాదు’
భూపాలపల్లి అర్బన్: కారల్‌మార్క్స్ కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణంపై కాలనీ ప్రజలు ఆరోపణలు చేయడం సరికాదని బీఎంఎస్ ఫిట్ కార్యదర్శులు పునిత్‌రావు, రాజ్‌నాయక్‌లు అన్నారు. శనివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఎంఎస్ ఇతర అనుబంధ సంఘాలు గుడులు, బడుల నిర్మాణాలకు వ్యతిరేకం కాదన్నారు. దేవాలయ నిర్మాణంపై కేవలం అప్పాని శ్రీనివాస్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సింగరేణి కార్మిక కాలనీకి చెందిన స్థలంలో హన్‌మాన్ దేవా లయ నిర్మాణం చేపట్టవద్దని అన్ని కార్మిక సంఘాల నాయకులు కలిసి జీఎంకు వినతిపత్రాన్ని అందించినట్లు తెలిపారు. శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశామని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడి నిర్మాణానికి కేటాయించిన రూ.55లక్షల నిధులను దుర్వినియోగం కా కుండా ఉపయోగించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నలుగూరి శ్రీనివాస్, పండాల మల్లేష్, చిట్యాల ప్రవీణ్, భాస్కర్, అల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓవర్‌లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు
వెంకటాపురం(కె): మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ ఉమారావు అన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ పర్శిక శ్రీలత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఈ ఉమారావు మాట్లాడుతూ గ్రామాల్లో మీటర్ లేనివారు పీఎం జుగా స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉచిత మీటర్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ హనుమాన్‌దాస్, లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, అసిస్టెంట్ లైన్‌మెన్ ఫరీద్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


