వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ దినోత్సవా న్ని పురస్కరించుకొని రామప్ప దేవాలయంలో కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏ ర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గిరి బాబు హాజరై ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ సాయి కృష్ణ, సీనియర్ సీఏ అజిత్‌లు మాట్లాడారు. దేశంలో మూడు వేలకు పైగా కేంద్రపురావస్తు శాఖ ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్నామన్నా రు. ఇందులో 43 యునెస్కో గుర్తించిన ప్రపంచ వా రసత్వ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు, వాటి చరిత్ర తెలిపే విధంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను రామప్పలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వారసత్వ కట్టడాలను సంరక్షించడంలో ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రమేశ్, సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ రాజు, కేంద్ర పురావస్తు, దేవాదాయ శాఖ సి బ్బంది, టూరిస్ట్ పోలీసులు, గైడ్స్ పాల్గొన్నారు.


