హేమాచలుడిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి హరినాధ్‌ దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, రాజీవ్‌ శర్మ, ఈశ్వర్‌చంద్‌ వారి పేరిట స్వయంభు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి సూర్యచంద్రకళ, అడిషనల్‌ జడ్జి డి.మధులిక తేజ, ఎస్సై టీవీఆర్‌ సూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement