ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ అన్నారు. మండలంలోని గంగారం పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ సమీపంలో కారుకొండా సడాలమ్మ జాతరను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు కొర్నెబెల్లి గణేష్, చింత రమేష్, కొమరం రవి, సర్వేష్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్న పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ. ఆదివాసీల ఇలవేల్పు జాతరల రక్షణ కోసం కృషి చేయాలన్నారు. క్రీడలు, విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మొదటి బహుమతి రూ. 25,016, ద్వితీయ బహుమతి రూ.15,016, తృతీయ బహుమతి రూ.10,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బడే రజిత రాంబాబు, యువజన సంఘాల అధ్యక్షుడు నవీన్, క్రీడాకారులు పాల్గొన్నారు.


