భూపాలపల్లి: ట్రాఫిక్ పోలీసులు వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో భూపాలపల్లి ట్రాఫిక్ పోలీసులకు చలువ కళ్లద్దాలను ఎస్పీ పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఎండలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ, తరచూ నీరు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


