ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ బూరుగు రవి మాట్లాడుతూ.. తెలంగాణ 2వ పీఆర్‌సీని శివశంకర్‌ కమిటీ నుంచి తెప్పించుకొని 51శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగుల ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 13వేల పైచిలుకు ఉన్న ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను ఏకమొత్తంలో ఒకే సారి విడుదల చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దుచేసి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీ మ్‌ (ఓపీఎస్‌)ను అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. ప్రభుత్వం ముందుంచిన 63 డిమాండ్లను పరి ష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రేగూరి సుభాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, దిల్షాద్‌, రామ్మోహన్‌, ఐలయ్య, మధుసూద న్‌, శ్రీనివాస్‌, దశరథరామారావు, సునీల్‌, షఫి సర్కార్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement