మల్హర్(కాటారం): మహిళల స్వయంకృషితో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్, కుట్లు, అల్లికల ద్వారా లక్షల రూపాయలు అర్జించే అవకాశం ఉంటుందని కాటారం మార్కెట్ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం రైతు వేదికలో ఉచిత టైలరింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఆర్‌డీఓ బాలకృష్ణతో కలిసి గురువారం పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు ఆలోచనతో ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, వడ్డీలేని రుణాలు, పెట్రోల్ పంపులు, టైలరింగ్ ఉపాధి శిక్షణ కేంద్రాలను మహిళలకు కేటాయిస్తున్నారని చెప్పారు. మహిళలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాపారవేత్తలుగా పారిశ్రామిక సంస్థలను నెలకోల్పాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవికుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు ఫరహాన బేగం, సీసీలు రవికుమార్, లక్ష్మి, సారక్క, మాధవి టైలరింగ్ శిక్షకులు సజన, కల్పన పాల్గొన్నారు.
కాటారం మార్కెట్ చైర్‌పర్సన్ తిరుమల


