భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు గురువారం మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పట్టణంలో 30 వార్డులు ఉండగా నలుగురు కో–ఆప్షన్ సభ్యులను నియమించనున్నారు. ఈ మేరకు జనరల్ కేటగిరిలో ఒక మహిళ, జనరల్, మైనారిటీ కేటగిరిలో ఒక మహిళ, జనరల్ స్థానాలను కేటాయించారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్‌ను హైదరాబాద్ ఏడో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు.
ఐటీడీఏ ఏపీఓ
డిప్యుటేషన్ రద్దు
● ఉట్నూరుకు వసంతరావు బదిలీ
● ఏటూరునాగారం ఏపీఓగా
నాగోవరావు నియామకం
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏలో డిప్యుటేషన్‌పై ఏపీఓగా పనిచేస్తున్న వసంతరావు జాదవ్ డిప్యూటేషన్‌ను ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సబ్యసాచి ఘోష్ రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరులో పనిచేయాల్సిన వసంతరావు ఏటూరునాగారం డిప్యుటేషన్‌పై వచ్చారు. గత ఏడాదిగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఎట్టకేలకు హైదరాబాద్‌లో ఏపీఓ జనరల్‌గా పనిచేస్తున్న నాగోవరావును ఏటూరునాగారం ఏపీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓగా నాగోవరావు విధుల్లో చేరనున్నారు.
దేవాదుల మోటార్ల
పంపింగ్ నిలిపివేత
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీ గుట్టగంగారం వద్ద ఉన్న దేవాదులలో నాలుగు మోటార్ల పంపింగ్‌ను బుధవారం అధికారులు నిలిపి వేశారు. దేవాదుల వద్ద మూడు ఫేజ్‌లలో పది మోటార్లు ఉన్నాయి. అందులో గత కొన్ని రోజుల నుంచి ఎత్తిపోతల వద్ద ఆరు మోటార్లతో పంపింగ్ చేస్తూ నీటిని దిగువలో ఉన్న భీమ్‌ఘన్‌పూర్, గొల్ల బుద్ధారం రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసిన అధికారులు బుధవారం ఫేజ్ త్రీలో మూడు, ఫేజ్ టులో ఒక మోటారును ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం పేజ్‌త్రీలో రెండు మోటార్లతో 583 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వ్యాస సంపుటి ఆవిష్కరణ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జర్నలిజం విభాగ అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి రచించిన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అంశాలపై వ్యాస సంపుటిని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులు, పరిశోధన, రచనా రంగాల్లో చురుగ్గా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. ఈగ్రంథం సమాజ చైతన్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రామ్‌రెడ్డి, ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, రచయిత డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.


