● జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కిరణ్‌కుమార్
కాళేశ్వరం: ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని, దీనిని పూర్తిగా అడ్డుకునే దిశగా కఠినచర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, పౌర సరఫరాలశాఖలు సమన్వయంతో 24 గంటలు నిరంతర పహారా నిర్వహిస్తాయన్నారు. జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడడం, వారికి న్యాయమైన మద్దతు ధర ల భించేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా పటిష్ట నియంత్రణ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టు ద్వారా వాహనాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని, నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాములు, ఎస్సై తమాషారెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీజ, సివిల్ సప్లయీస్ ఇన్‌స్పెక్టర్లు సురేందర్‌రెడ్డి, రాజు, జీపీఓ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


