యువత భవిత మనందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

యువత భవిత మనందరి బాధ్యత

Apr 16 2026 10:36 AM | Updated on Apr 16 2026 10:36 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: యువత భవిత మనందరి బాధ్యతని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. అలైవ్‌–అరైవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో పో లీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, మత్తు ప దార్థాల నిర్మూలన, సైబర్‌ నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచులు, మున్సిపల్‌ కౌ న్సిలర్లకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువతలో సానుకూల మార్పు తీసుకురావడంలో గ్రామ, వార్డుస్థాయి నాయకత్వం కీలకమన్నారు. ప్రజాప్రతినిధులు ముందుండి యువతను సరైన దిశలో నడిపించాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి వివరాలను పోలీసులకు తెలియజేసి సమాజాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీని కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. అనంతరం రహదారి భద్రతపై పోలీసు అధికారులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీ సంపత్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement