బాధితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం చేయాలి

Apr 1 2026 7:48 AM | Updated on Apr 1 2026 7:48 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: ప్రతీ కేసులో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలోని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. విచారణలో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

వెంకట్‌రెడ్డి సేవలు మరువలేనివి..

గంట వెంకట్‌రెడ్డి 36 ఏళ్ల పాటు పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ పొందగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement