● జిల్లా వైద్యాధికారి మధుసూదన్
రేగొండ: అవగాహన పెంచుకోవడం ద్వారా కుష్ఠు వ్యాధిని కొంతవరకు నివారించవచ్చని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని సబ్ సెంటర్‌లో కుష్ఠు వ్యాధి గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధి సంక్రమణ వ్యాధి అయినప్పటికీ ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి లక్షణాలున్న వ్యక్తిని గుర్తించి, పరీక్షలు చేసి ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి హిమబిందు, పీఎంఓ మల్లయ్య, ఏపీఎంఓ ఎర్రయ్య నాయక్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
టెన్త్ పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ జిల్లా కేంద్రంలోని సింగరేణి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ రాజేందర్ స్థానికంగా ఉన్న నాలుగు పరీక్ష కేంద్రాలను, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయాన్ని తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 3,544 మంది విద్యార్థులకు గాను ఐదుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు.
జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు తెలిపారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 8గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నాలుగవ తరగతి చదువుతున్న బాలబాలికలకు ఎత్తు, బరువు, 800 మీటర్ల పరుగు, షటిల్ రన్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ఫ్లయింగ్ స్టార్ట్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ వంటి తొమ్మిది రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన వారిలో నుంచి 10 మంది చొప్పున బాలబాలికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులే జిల్లాస్థాయి ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే వారు జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.


