సమస్యల పరిష్కారానికి లోకల్‌ కోర్టు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి లోకల్‌ కోర్టు

Mar 24 2026 8:04 AM | Updated on Mar 24 2026 8:04 AM

సమస్యల పరిష్కారానికి లోకల్‌ కోర్టు

టేకుమట్ల: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ వినియోగదారుల వేదిక(లోకల్‌ కోర్టు)లను నిర్వహిస్తునట్లు టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగదారుల ఫోరం చైర్మన్‌ ఎన్‌వీ వేణుగోపాలచారి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో విద్యుత్‌ సమస్యలు–పరిష్కారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి 19 దరఖాస్తులను స్వీకరించి, మూడు సమస్యలను అక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూజ్‌ లైన్లు, రోడ్డు క్రాసింగ్‌లు, ఓవర్‌ లోడ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు విద్యుత్‌ అధికారులకు రాత పూర్వకంగా వినతి పత్రాలు అందించాలన్నారు. విద్యుత్‌ సమస్యలు ఉంటే స్థానికంగా ఉండే విద్యుత్‌ అధితకారులతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన వినియోగదారుడి విద్యుత్‌ సమస్యను 45రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు విద్యుత్‌ అధికారులకు విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫైనాన్ష్‌ మెంబర్‌ దేవేందర్‌, టీఎం రమేష్‌, భూపాలపల్లి డీఈ నాగరాజు, చిట్యాల ఏడీఈ సుందరకుమార్‌, ఎస్‌ఏఓ లక్‌పతి, ఏఏఓ సతీష్‌, ఏఈలు మణిదీప్‌, చంద్రశేఖర్‌, సంజయ్‌, సబ్‌ ఇంజనీర్లు వెంకటేష్‌, శ్రీనివాస్‌, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement