భూపాలపల్లి: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న(రేపు) పోలీసు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మహాముత్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెగడపల్లి ఆశ్రమ పాఠశాలలో క్యాంపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 5000 మంది గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ క్యాంపులో హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు సేవలు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మారుమూల ప్రాంత ప్రజలు సద్వినియోగిం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
తక్షణ పరిష్కారమే లక్ష్యం..
ప్రజాదివస్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌లో ఆయన 10 ఫిర్యాదులకు స్వీకరించారు.
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం..
భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్ పక్కన గల సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో నేడు (మంగళవారం) డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జిల్లాలోని ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
● గిరిజనులకు ఉచితంగా వైద్యసేవలు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


